ఎప్పుడో మొదలై
ఎక్కడో పరిపూర్ణమౌతుంది
జీవితం ఒక ప్రవాహం
ప్రతిమజిలీ పరిచయాలను, అనుభవాలను జతచేసి
కొన్నింటిని పరిమార్చిఏమైతేనేం చివరికి మాత్రం
ఒంటరితనాన్ని తోడిచ్చి
గమ్యం వైపు భారంగా అడుగులు వేయిస్తుంది
జీవితం ఒక ప్రయాణం
పునరపి జననం పునరపి మరణం
జనమరణాల నడుమ జీవితమొక విరామ చిహ్నం.
3 వ్యాఖ్యానాలు...:
" జనమరణాల నడుమ జీవితమొక విరామ చిహ్నం" బాగుంది.
బావుంది..
ప్రతీ జీవితమూ పరిపూర్ణమవుతుందంటరా!!?
@చైతన్య: నెనర్లు.
@kumar: ఏమో నండి నాకూ తెలీదు కానీ కొన్ని సార్లు మనం అలా అనుకోవాలసి వస్తుంది.
Post a Comment