Friday, September 4, 2009

బాటసారి

కదిలీ కదలని క్షణాలను,
వదలీ వదలని ఙాపకాలను
దాటుకుంటూ, దారిచేసుకుంటూ
వెనుదిరిగి రావడం అనుమానమే ఐనా
మరుపు మలుపుల్లో
కన్నీటి ఆనవాళ్ళు విడుస్తూ,
ఖాళి గుండెతో తాళం వేస్తూ
మరణాన్నలా ఆహ్వానిస్తూ
నా జీవనగీతాన్నిలా పాడుతూనే వుంటాను.
ఒంటరితనం తోడుగా సాగిపోతూనేవుంటాను.

4 వ్యాఖ్యానాలు...:

'Padmarpita' said...

బాగుంది...

ఉష said...

వేదనాభరితంగా వుంది. నావీ విలాపాలు వుంటాయి, వెనువెంటనే విహారాలు వెలికి వస్తాయి, విలాసాలూ వెల్లువౌతాయి. మీకు అవే అనుభవాలు, స్పందనలు కలగాలని.. కోరిక.
నా బ్లాగులో ఒక్కటే వ్యాఖ్య మీ నుండి కానీ అది మరొకరి సందేహాన్ని తీర్చినది కనుక అలా గుర్తుండిపోయింది మీ పేరు Ref: http://maruvam.blogspot.com/2009/01/blog-post_17.html చానాళ్ళకి మళ్ళీ తారసపడ్డారిలా, నాకు కాస్త తీరిక చిక్కటం, మీ కవిత కనుల ముందు కదలాడటం, కాస్త పాత జ్ఞాపకాలని నెమరేసుకోను వీలు కల్పించింది...

ఉష said...

అన్నట్లు నా బహుదూరపు బాటసారి స్వగతం ఇది http://maruvam.blogspot.com/2009/06/blog-post_05.html

అలేఖ్య said...

Thanks!!