మరుజన్మటూ వుంటే...
పట్టుపురుగులా పదిరోజులే జీవించినా
పట్టంపూచిలా మాధుర్యాన్నాస్వాదించాలి
భ్రాంతినై దు:ఖాలన్నింటినీ దూరంచెయ్యాలి
కన్నీటినై గుండెలు తేలిక పరచాలి
మరుజన్మంటూ వుంటే...
పసిపాపనై నీ ఒళ్ళో కెరింతలు కొట్టాలి
అమ్మనై నిన్ను లాలించాలి
జీవితమై నీ వెన్నంటి నడవాలి
మరణమై నాలో కలిపేసుకోవాలి
మరుజన్మంటూ వుంటే...
ప్రేమైనై మనసుల్ని కలపాలి
మనసునై ప్రేమని పండించాలి
సరిహద్దునై చెరిగిపోవాలి
జ్ఞాపకంగా నేను మిగిలిపోవాలి
1 వ్యాఖ్యానాలు...:
చాలా బావుందండీ ..
superb
Post a Comment