హ్రుదయాన్ని కాగితప్పడవనుకోలేదు
వడగళ్ళకు వెరవలేదు
గండాలకు జడవలేదు
హృదయాన్ని బంగారుముద్దనుకోలేదు
పారేసుకుంటానన్న భయంలేదు
కానీ తిరిగొస్తుందన్న ఆశలేదు
హృదయాన్ని తెల్ల కాగితమనుకోలేదు
దిద్దుబాటలకీ, కొట్టివేతలకీ బెదరలేదు
చిరుగులకీ, మరకలకీ కొరవాలేదు
హృదయాన్ని గాలిపటమనుకోలేదు
తెగి, పోతుందని గాభరాలేదు
హద్దుల్లో పెట్ట ప్రయత్నించనూలేదు
ఇప్పుడు చూసుకుంటే
మీ క్రొంగొత్త హృదయాలకంటే
చివికి, చిరుగులు పడినా
గాయాలు, గాట్ల పాలైనా
నా హృదయమే చాలా అందంగా వుంది.
(ఒక ఉరుదూ కవిత చదివిన మైకంలో, అదిచ్చిన స్పూర్తిలో...)
2 వ్యాఖ్యానాలు...:
Nice....
నా పిచ్చి ప్రయత్నం మీకు నచ్చినందుకు Thanks
Post a Comment