రేయ్... బుజ్జులూ...
Calendar తో ఓడిపోయిన నేను
Dairy లో వెనక్కి వెళ్ళాను తెలుసా...
లేదురా...
పేజీలమధ్యకు నెట్టేసింది నిన్నుకాదు
నెమలీకల్లా పడుంది నీ జ్ఞాపకాలూ కాదు
నా నవ్వులు, నేను నిజ్జంగా జీవించిన క్షణాలు
ప్రతి పేజీ, ప్రతి పేరా
పూదోటలా గుబాళిస్తుంటే
ఆక్షరా(ణ)లన్నీ butterflies లా
గదంతా నిండిపోయాయ్ తెలుసా...
కళ్ళు మసకేసాయ్,
గుండె బరువెక్కింది
పేజీలన్నీ పడవలై ఎక్కడ కొట్టుకుపోతాయోనని
తిరిగొచ్చేశాను తెలుసా...
Frends అంటారూ... నాకు నువ్వు గుర్తొచ్చావంట...
Idiots... వాళ్ళకేమీ తెలీదు
నేనసలు నిన్ను మర్చేపోలేదు తెలుసా...
నిన్న వర్షమొచ్చింది కదా
నీ మొట్టికాయలా చల్లగా తాకింది
Rainbow చూశావూ
నీ బుంగమూతిలా భలే వుంది
చినుకులన్నీ చిన్నపిల్లల్లా రోడ్లవెంట పరిగెడుతుంటే
నిన్ను వెతికాను తెలుసా...
4 వ్యాఖ్యానాలు...:
చాలా బాగా రాస్తున్నారండి
"నిన్న వర్షమొచ్చింది కదా
నీ మొట్టికాయలా చల్లగా తాకింది"
అన్నిటిలోనూ నిన్నే చూస్కుంటున్నా అనే భావాన్ని భలే చెప్పారు.
మొత్తం పోస్టులన్నీ బాగున్నాయండి.
keep posting
Thank you very much.
Beautiful.
superb........
Post a Comment