మళ్ళీ first bell మోగాలి
నేర్చుకున్న అపోహల్ని
తలకెక్కించుకున్న అపార్ధాల్ని
కల్మషాల్నీ, కౌటిల్యాన్నీ
పడవలుచేసి నీళ్ళలో ముంచెయ్యాలి
కొత్త notebook కావాలి
రంగు పెన్సిళ్ళతో నాపేరు అందంగా రాసుకోవాలి
రాసుకున్నవేవీ చెరిగిపోకుండా
రాసినవేవీ అరిగిపోకుండా
జేబుక్కట్టుకు తిరగాలి
ఘడియ ఘడియకీ పాఠాలు మారతాయ్
పరీక్షలూ మారతాయ్
పంతుళ్ళూ మారతారు
Fail అయిన ప్రతిసారీ తడిగానైనా నవ్వాలి
Humpty Dumpty తిరగ రాయాలి
స్నేహాలతో జేబు నింపుకోవాలి
కొన్ని జాబులూ, రుమాళ్ళూ ఇచ్చిపుచ్చుకోవాలి
Head master నన్ను పైక్లాసులకని పంపించేలోగా
మళ్ళీ first bell మోగాలి.
1 వ్యాఖ్యానాలు...:
బాగుంది.
Post a Comment