Wednesday, February 23, 2011

నీ జ్ఞాపకాలు

కన్నీళ్ళతో చెరిగిపోని శిలాక్షరాలు
కాలం మలాముతో ఎన్నటికీ మానని గాయాలు
నీ జ్ఞాపకాలు

మళ్ళీ మళ్ళీ తిరిగొచ్చే కెరటాలు
లోతుల్లోకి లాక్కెళ్ళే ఉప్పునీటి సుడులు
నీ జ్ఞాపకాలు

నలుగురిలో కన్నీటి ఆనవాళ్ళు
ఒంటరితనంలో గులాబి ముళ్ళు
నీ జ్ఞాపకాలు

జోకొట్టే జోలపాటలు
నిద్రనుచెరచే అలజళ్ళు
నీ జ్ఞాపకాలు

జేబులో తడిచిన రుమాళ్ళు
గుండెల్లో పేలే తుపాకీ గుళ్ళు
నీ జ్ఞాపకాలు