Saturday, May 28, 2011

సరిహద్దు

నాక్కొన్ని సరిహద్దులు కావాలి.
వాటినానుకొని కొన్ని గోడలు కావాలి.
అవి చిన్నగానూ, అందంగానూ వుండాలి.
ఇంకో ఆరడుగులు వృధాచెయ్యడం నాకిష్టంలేదు.
వాట్నెవరూ దాటిరాకుండా...
కరకు మాటల తూటాలు పోగుచేసుకోవాలి.
అలాగే కొన్ని తలుపులు, కొన్ని తాళాలు కూడా
సీల్డ్ ప్యాక్‌లో టీపొడిలా...
నా ఆలోచనల్ని నాలోనే బంధించి వుంచుకొనేందుకు,
కొన్నింటినుంచి నన్ను రక్షించుకొనేందుకు.
నావన్నీ నేనే అనుభవిస్తూ,
అందరినుంచీ అనంతానంతదూరం వెళ్ళిపోయి
కృష్ణబిలంలా మారిపోవాలి.

0 వ్యాఖ్యానాలు...: