క్షణానికోలా మారిపోయే నీకంటే
ఎప్పటికీ స్థిరంగా నిలిచుండే నీఊహంటేనే ఇష్టం
నీలోనిమార్పుల్ని పట్టిచ్చే నీచిత్తరువులంటేనే ఇష్టం
నీటిమూటల్లాంటి నీ బాసలకంటే
శిలాక్షరసామ్యంగా నిలిచిపోయే లేఖలంటేనే ఇష్టం
సమాధిలోకి తోడొచ్చే నీజ్ఞాపికలంటేఇష్టం
గుచ్చుకొని గాయపెట్టే నీ మాటలకంటే
తియ్యగా బాధించే నీమౌనం ఇష్టం
నాకోసం ఇంకెన్నటికీ నువ్వు పాడని పాటలిష్టం
ఓ కౄరురాలా! నిజమైన నీకంటే
అందమైన నీజ్ఞాపకం ఇష్టం
చీరపల్చని నీస్నేహం ఇష్టం
వేధిస్తున్న వర్తమానం కంటే
భయంగొల్పుతున్న భవిష్యత్తుకంటే
నీస్థాయికెదిగిన నాగతం నాకిష్టం
దగ్గరయి నిర్లక్ష్యించబడేకంటే
దూరమైనా నీమన్నన నాకిష్టం
---------------X-----------------
ఎప్పటికీ స్థిరంగా నిలిచుండే నీఊహంటేనే ఇష్టం
నీలోనిమార్పుల్ని పట్టిచ్చే నీచిత్తరువులంటేనే ఇష్టం
నీటిమూటల్లాంటి నీ బాసలకంటే
శిలాక్షరసామ్యంగా నిలిచిపోయే లేఖలంటేనే ఇష్టం
సమాధిలోకి తోడొచ్చే నీజ్ఞాపికలంటేఇష్టం
గుచ్చుకొని గాయపెట్టే నీ మాటలకంటే
తియ్యగా బాధించే నీమౌనం ఇష్టం
నాకోసం ఇంకెన్నటికీ నువ్వు పాడని పాటలిష్టం
ఓ కౄరురాలా! నిజమైన నీకంటే
అందమైన నీజ్ఞాపకం ఇష్టం
చీరపల్చని నీస్నేహం ఇష్టం
వేధిస్తున్న వర్తమానం కంటే
భయంగొల్పుతున్న భవిష్యత్తుకంటే
నీస్థాయికెదిగిన నాగతం నాకిష్టం
దగ్గరయి నిర్లక్ష్యించబడేకంటే
దూరమైనా నీమన్నన నాకిష్టం
---------------X-----------------
1 వ్యాఖ్యానాలు...:
చాలా బాగుంది ఈ కవిత. ప్రేమని ప్రదర్శిస్తూనే ఓ కమ్మటి రుసరుస :) వెరసి విరహంలో / ప్రేమలో ఓ కొత్త దృక్కోణం
Post a Comment